Road Accident: పాకిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం... 20 మంది సజీవ దహనం

Fatal road accident in Pakistan

  • పంజాబ్ ప్రావిన్స్ లో దుర్ఘటన
  • ఆయిల్ ట్యాంకర్ ను వెనుక నుంచి ఢీకొట్టిన బస్సు
  • బస్సులో 26 మంది 
  • గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన దేహాలు
  • తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పాక్ ప్రధాని

పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇక్కడి ఓ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న బస్సు వెనుక నుంచి ఆయిల్ ట్యాంకర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భారీ ఎత్తున మంటలు చెలరేగగా, 20 మంది సజీవదహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 24 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఆ బస్సు కరాచీ నుంచి లాహోర్ వెళుతోంది. కాగా, ఘటన జరిగిన వెంటనే ట్యాంకర్ డ్రైవర్ పరారయ్యాడని పోలీసులు తెలిపారు. 

ఈ ప్రమాదంలో కొందరి దేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. డీఎన్ఏ టెస్టుల ద్వారా మృతదేహాల గుర్తింపు చేపడతామని అధికారులు తెలిపారు. గాయాలపాలైన ఆరుగురిని ముల్తాన్ నగరంలోని నిష్తార్ ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు అభిప్రాయపడ్డారు. రోడ్డు ప్రమాద ఘటనపై పాకిస్థాన్ ప్రధాని షేబాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంతమంది ప్రాణాలు కోల్పవడం కలచివేస్తోందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Road Accident
Bus
Oil Tanker
Punjab Province
Pakistan
  • Loading...

More Telugu News