Bipasha Basu: తల్లి కాబోతున్న బిపాషా బసు

Bipasha Basu Expecting First Child

  • 2016లో పెళ్లి చేసుకున్న బిపాషా, కరణ్ సింగ్ గ్రోవర్
  • తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ఈరోజు ప్రకటించిన బిపాషా
  • ఇప్పటి వరకు ఇద్దరిగా ఉన్న మేము ముగ్గురవుతున్నామని వ్యాఖ్య

బాలీవుడ్ స్టార్ కపుల్ బిపాషా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ లు తల్లిదండ్రులు కాబోతున్నారు. త్వరలోనే బిపాషా తమ తొలి బిడ్డకు జన్మనివ్వబోతోంది. తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈరోజు బిపాషా ప్రకటించింది. తన భర్తతో కలిసి బేబీ బంప్ తో ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. 

'ఒక కొత్త సమయం, ఒక కొత్త ఫేజ్, ఒక కొత్త కాంతి... ప్రిజం లాంటి మా జీవితంలో మరో షేడ్ ను తీసుకొచ్చాయి. మేమిద్దరం ఎవరికి వారు వేర్వేరుగా జీవితాలను ప్రారంభించాం. ఆ తర్వాత ఇద్దరం కలుసుకున్నాం. అప్పటి నుంచి ఒక్కొక్కరిగా ఉన్న మేము ఇద్దరమయ్యాం. ఇద్దరికే ఇంత ఎక్కువ ప్రేమ అవసరమా? అనిపించింది. అందుకే ఇద్దరిగా ఉన్న మేము ముగ్గురం అవుతున్నాం. మా ప్రేమకు ప్రతిరూపంగా మాకు మా బిడ్డ జాయిన్ కాబోతోంది. మీ అందరి ప్రేమ, అభిమానాలకు ధన్యవాదాలు' అని బిపాషా ఇన్స్టాలో స్పందించింది. 

2015లో 'అలోన్' సినిమా సందర్భంగా బిపాషా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ ఇద్దరూ కలిశారు. సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. 2016 ఏప్రిల్ లో వీరిద్దరూ బెంగాలీ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరు ముంబైలో ఇచ్చిన రిసెప్షన్ కు ఎందరో బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. మరోవైపు వీరిద్దరూ కలిసి 'డేంజరస్' అనే వెబ్ సిరీస్ లో కూడా నటించారు.

Bipasha Basu
Pregnant
Karan Singh Grover
Bollywood
  • Loading...

More Telugu News