LM Kaushik: ప్రముఖ తమిళ ఫిల్మ్ క్రిటిక్ కౌశిక్ హఠాన్మరణం

Film Critic LM Kaushik passes away

  • గుండెపోటుతో మృతి చెందిన ఎల్ఎం కౌశిక్
  • చనిపోవడానికి ముందు 'సీతారామం'పై ట్వీట్ 
  • చిత్ర ప్రముఖుల సంతాపం 

తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ ఎల్ఎం కౌశిక్ హఠాన్మరణం చెందారు. 36 ఏళ్ల కౌశిక్ కు నిన్న సాయంత్రం గుండెపోటు వచ్చింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం దక్కలేదు. తమిళనాట కౌశిక్ కు ఎంతో పేరుంది. సినిమాల విశేషాలు, కలెక్షన్లు తదితర అంశాలపై ఆయన ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు ఎంతో సమాచారాన్ని అందిస్తుంటారు. ట్విట్టర్ లో ఆయనను ఎందరో ఫాలో అవుతుంటారు. 

సెలబ్రిటీలను ఆయన చేసే ఇంటర్వ్యూలు కూడా సినీ అభిమానులను ఎంగానో ఆకట్టుకునేవి. చనిపోవడానికి ఆరు గంటల ముందు కూడా ఆయన 'సీతారామం' సినిమాకు సంబంధించిన ట్వీట్ చేశారు. వరల్డ్ వైడ్ గా రూ. 50 కోట్ల గ్రాస్ ను ఈ సినిమా సాధించిందని... ఇది అఫీషియల్ అని తెలిపారు.

కౌశిక్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధనుష్, కీర్తి సురేశ్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

LM Kaushik
Film Critic
Dead
Tollywood
Bollywood
  • Loading...

More Telugu News