New Delhi: ఢిల్లీ రోడ్డుపై బిచ్చగాడు... పెద్ద మోడల్ లా ఉన్నాడు.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఇదిగో!

- నలుపు రంగు టీషర్టు, కళ్లద్దాలతో ఆకట్టుకునేలా ఉన్న వ్యక్తి
- ఎవరో బాలీవుడ్ హీరో అయి ఉంటాడంటూ నెటిజన్ల కామెంట్లు
- అల్లు అర్జున్ లా ఉన్నాడంటూ మరి కొందరి రిప్లైలు
ఢిల్లీలోని బాగా బిజీగా ఉండే కూడలి.. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనాలు ఆగి ఉన్నాయి. ఇంతలో ఒకతను వాహనాల మధ్యలోంచి వెళుతున్నాడు. నలుపు రంగు టీషర్ట్, కళ్లకు నల్ల కళ్లజోడు పెట్టుకుని.. మంచి హెయిర్ స్టైల్ తో కనిపించాడు. చూడగానే ఎవరో మోడలో, సినిమా స్టారో అన్నట్టుగా కనిపించాడు. కానీ కిందికి చూస్తే.. కాలు దెబ్బతిని, చేతి కర్రలతో నడుస్తున్నాడు. నిజానికి అతనొక భిక్షగాడు. ఇది గమనించగానే జాలి వేసినా.. అతడి రూపం, స్టైల్ చూసి చాలా మంది ఫిదా అయిపోతున్నారు. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నిజంగా భిక్షగాడే..

అల్లు అర్జున్ లా ఉన్నాడంటూ..
- ఇక బాలీవుడ్ నటుడు ఆదిత్యరాయ్ కపూర్ లా ఉన్నాడని, హృతిక్ రోషన్ తమ్ముడిలా ఉన్నాడని కొందరు అంటుంటే.. పుష్ప హీరో అల్లు అర్జున్ లా ఉన్నాడంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.
- అతనెవరోగానీ ఇన్ స్టాగ్రామ్ ఖాతా తెరిచి ఫొటోలు పెట్టి ఉంటే బాగా ఫాలోయింగ్ వచ్చి ఉండేది అని చెప్తున్నవారూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.