Narendra Modi: ప్ర‌ధాని మోదీ 'ఆగ‌స్టు 15' హామీల‌పై సొంత పార్టీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి సెటైర్లు

bjp mp subramanian swamysatires on pm modi promises

  • ఈ ఆగ‌స్టు 15న మోదీ ఏఏ హామీలిస్తారోన‌న్న స్వామి
  • 2017 ఆగస్టు 15 ప్ర‌సంగంలో మోదీ హామీల‌ను గుర్తు చేసిన బీజేపీ ఎంపీ
  • నాటి హామీల‌న్నీ అమ‌ల‌య్యాయా? అని సెటైర్‌

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై సొంత పార్టీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి శ‌నివారం రాత్రి సోష‌ల్ మీడియా వేదిక‌గా సెటైర్లు సంధించారు. 2017 ఆగ‌స్టు 15న దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన మోదీ ఇచ్చిన హామీల‌ను గుర్తు చేసిన స్వామి... అవ‌న్నీ నెర‌వేరాయా? అని ప్ర‌శ్నించారు. అంతేకాకుండా ఈ ఏడాది ఆగ‌స్టు 15న మోదీ త‌న ప్ర‌సంగంలో ఏమేం హామీలు ఇస్తారోన‌ని కూడా ఆయ‌న సెటైర్లు సంధించారు.

2017 ఆగ‌స్టు 15 నాటి ప్ర‌సంగంలో మోదీ దేశ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను, వాటిని 2022 ఆగస్టు 15 కల్లా నెరవేరేలా చేస్తామని చెప్పిన వైనాన్ని ఈ సంద‌ర్భంగా సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి గుర్తు చేశారు. ఏటా 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాన‌ని నాడు మోదీ హామీ ఇచ్చార‌ని స్వామి పేర్కొన్నారు. అంతేకాకుండా ప్ర‌జ‌లంద‌రికీ ఇళ్లు ఇస్తాన‌ని చెప్పార‌న్నారు. రైతుల ఆదాయాన్ని రెండింత‌లు చేస్తాన‌ని మోదీ ఇచ్చిన హామీనీ ఆయ‌న గుర్తు చేశారు. చివ‌ర‌గా బుల్లెట్ రైలుపై ప్ర‌ధాని చేసిన వాగ్దానాన్ని స్వామి గుర్తు చేశారు.

More Telugu News