Congress: గాంధీ భ‌వ‌న్‌లో అజారుద్ధీన్‌... మునుగోడు ఉప ఎన్నిక‌పై భేటీకి హాజ‌రైన మాజీ క్రికెట‌ర్‌

Mohammed Azharuddin attends munugodu bypoll meeting at gandhi bhavan

  • టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొన‌సాగుతున్న అజారుద్దీన్‌
  • గాంధీ భ‌వ‌న్‌లో మునుగోడు ఉప ఎన్నిక‌పై స‌మావేశం
  • స‌మావేశంలో మాట్లాడిన టీమిండియా మాజీ కెప్టెన్‌

క్రికెట్‌కు గుడ్ బై చెప్పాక టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హ్మ‌ద్ అజారుద్ధీన్ కాంగ్రెస్ పార్ట‌లో చేరి త‌న పొలిటిక‌ల్ ఇన్నింగ్స్ మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం టీపీసీసీలో వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో పనిచేస్తున్న అజారుద్దీన్... పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో కనిపించరు. అప్పుడప్పుడూ అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటారు. 

తాజాగా న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక నేప‌థ్యంలో పార్టీకి చెందిన అధిష్ఠానం దూత‌లు హైద‌రాబాద్‌లోని గాంధీ భ‌వ‌న్‌లో టీపీసీసీకి చెందిన కీల‌క నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న విష‌యంపై ఈ సంద‌ర్భంగా చ‌ర్చ జ‌రిగిన‌ట్టు స‌మాచారం. ఈ స‌మావేశానికి అజారుద్దీన్ హాజ‌ర‌య్యారు. అంతేకాకుండా పార్టీ పెద్ద‌ల స‌మ‌క్షంలో ఆయ‌న మైక్ తీసుకుని మాట్లాడారు కూడా.

More Telugu News