Andhra Pradesh: చంద్ర‌బాబు, లోకేశ్‌లు క‌లియుగ రావణాసురులు: మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం

ap minister gummanuru jayaramfires on chandrababu and lokesh
  • ఆలూరులో మీడియాతో మాట్లాడిన జ‌య‌రాం
  • శూర్ప‌ణ‌ఖ‌ల‌ను త‌యారు చేసిన ఘ‌న‌త చంద్ర‌బాబుదేన‌ని ఆరోప‌ణ‌
  • చంద్ర‌బాబు రాజ‌కీయాల‌కు బ‌లి కావొద్ద‌ని మ‌హిళ‌ల‌కు సూచ‌న‌
టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న కుమారుడు, టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్‌ల‌పై ఏపీ మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం శ‌నివారం సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌ను ఆయ‌న క‌లియుగ రావ‌ణాసురులుగా అభివ‌ర్ణించారు. ఈ మేర‌కు శ‌నివారం క‌ర్నూలు జిల్లా ఆలూరులో మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

రాష్ట్రంలో కొంద‌రిని శూర్ప‌ణ‌ఖ‌లుగా చేసిన ఘ‌న‌త కూడా చంద్ర‌బాబుదేన‌ని కూడా జ‌య‌రాం మ‌రో ఘాటు వ్యాఖ్య చేశారు. చంద్ర‌బాబుకు అమ్మాయిల‌ను రాజ‌కీయం కోసం వాడుకోవ‌డం తెలుసు త‌ప్పించి.. మ‌హిళల‌ను ఆదుకోవ‌డం తెలియ‌ద‌న్నారు. చంద్ర‌బాబు రాజ‌కీయాల‌కు బ‌లి కావొద్దంటూ ఆయ‌న మ‌హిళ‌ల‌కు సూచించారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ వీడియో ఫేక్ అని ఎస్పీ చెప్పినా... ఈ విష‌యంపై మ‌రింత వివాదం రాజేసేందుకు టీడీపీ య‌త్నిస్తోంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.
Andhra Pradesh
Gummanuru Jayaram
YSRCP
TDP
Chandrababu
Nara Lokesh

More Telugu News