Shivamogga Subbanna: కన్నడ సినీ గాయకుడు శివమొగ్గ సుబ్బన్న మృతి

Kannada singer Shivamogga Subbanna passes away

  • నిన్న రాత్రి సుబ్బన్నకు గుండెపోటు 
  • బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
  • ఆయన వయసు 83 సంవత్సరాలు

ప్రముఖ కన్నడ గాయకుడు, జాతీయ అవార్డు గ్రహీత శివమొగ్గ సుబ్బన్న కన్నుమూశారు. నిన్న రాత్రి ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన బెంగళూరులోని జయదేవ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

సుబ్బన్న వయసు 83 సంవత్సరాలు. ఆయనకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. 'కాడు కుదురే' చిత్రంలో ఆయన పాడిన పాటకు నేషనల్ అవార్డు వచ్చింది. తన కెరీర్లో ఆయన ఎన్నో అవార్డులు, పురస్కారాలను అందుకున్నారు. గతంలో ఆయన అడ్వొకేట్ గా కూడా పని చేశారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

Shivamogga Subbanna
Kannada Singer
Dead
  • Loading...

More Telugu News