fifa: ఒక రోజు ముందుగానే వస్తున్న ఫుట్​ బాల్​ మెగా టోర్నీ

FIFA Officially Advances World Cup By A Day Tournament To Start On November 20

  • ఖతార్ లో  నవంబర్ 21న మొదలవ్వాల్సిన టోర్నీ
  • నవంబర్ 20నే ప్రారంభిస్తున్నట్టు వెల్లడించిన ఫిఫా
  • ఆరంభ వేడుకలు కూడా ఒక రోజు ముందుకు మార్పు  

ఫిఫా వరల్డ్ కప్ వస్తుందంటే ఫుట్ బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. నాలుగేళ్లకోసారి జరిగే ఈ టోర్నీలో అత్యుత్తమ పోటీ ఫ్యాన్స్ ను ఎంతగానో అలరిస్తుంది. వరల్డ్ కప్ తేదీ ఖరారు కాగానే టోర్నీ జరిగే దేశానికి వెళ్లేందుకు అభిమానులు ప్లాన్ చేసుకుంటారు. విమాన టిక్కెట్లు, హోటల్ రూమ్స్ బుక్ చేసుకుంటారు. అయితే, ఈ సారి వాళ్లు తమ ప్లాన్స్ ను మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే  ఈ ఏడాది ఖతార్ వేదికగా జరగాల్సిన ఫిఫా వరల్డ్ కప్ ఒక రోజు ముందే మొదలవనుంది. 

ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం నవంబర్ 21న ఈ టోర్నీ మొదలవ్వాలి. కానీ, నవంబర్ 20వ తేదీనే ప్రారంభిస్తున్నట్టు ఫిఫా గురువారం అధికారికంగా ప్రకటించింది. ఫిఫా వరల్డ్ కప్ షెడ్యూల్లో మార్పు రావడం చాలా అరుదు. పాత షెడ్యూల్‌లో భాగంగా నవంబర్ 21న ఈక్వెడార్‌తో ఖతార్ అధికారిక ప్రారంభ మ్యాచ్‌ ఉండాల్సి ఉంది. 

కొత్త షెడ్యూల్ ప్రకారం ఆ రోజు సెనెగల్ తో నెదర్లాండ్స్‌ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈక్వెడార్ తో ఖతార్ తొలి మ్యాచ్ ను నవంబర్ 20వ తేదీకి మార్చారు. టోర్నీ ప్రారంభ తేదీలో మార్పు జరగడంతో ఆరంభ వేడుకలను కూడా ఒక రోజు ముందుగా నిర్వహిస్తారు. మారిన తేదీలకు తగ్గట్టు ఖతార్ రావాలనుకుంటున్న సాకర్ అభిమానులు తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News