Sensex: తగ్గిన అమెరికా ద్రవ్యోల్బణం.. భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 515 పాయంట్లు పెరిగిన సెన్సెక్స్
- 124 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 2.75 శాతం పెరిగిన యాక్సిస్ బ్యాంక్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మంచి లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే భారీ లాభాల్లోకి వెళ్లిన సూచీలు... ఆ తర్వాత ఎక్కడా తగ్గలేదు. అమెరికా ద్రవ్యోల్బణం కొంత తగ్గుముఖం పట్టడం ఇన్వెస్టర్లలో జోష్ పెంచింది. ఈ కారణంగా అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లు లాభాల్లో పయనించాయి.
ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 515 పాయింట్లు లాభపడి 59,332కి ఎగబాకింది. నిఫ్టీ 124 పాయింట్లు కోల్పోయి 17,659కి చేరింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్ (2.75%), బజాజ్ ఫైనాన్స్ (2.36%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.32%), టెక్ మహీంద్రా (2.12%), టీసీఎస్ (1.98%).
టాప్ లూజర్స్:
ఐటీసీ (-1.56%), ఎన్టీపీసీ (-1.38%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.04%), భారతి ఎయిర్ టెల్ (-0.76%), మారుతి (-0.69%).