Vishal: షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డ హీరో విశాల్.. ఆసుపత్రికి తరలింపు

Actor Vishal injured in shooting

  • చెన్నైలో షూటింగ్ జరుపుకుంటున్న 'మార్క్ ఆంటొనీ'  
  • ఫైటింగ్ సీన్ షూటింగ్ సందర్భంగా గాయపడ్డ విశాల్
  • తాత్కాలికంగా ఆగిపోయిన షూటింగ్

ప్రముఖ సినీ నటుడు విశాల్ మరోసారి గాయపడ్డారు. ఈ తెల్లవారుజామున షూటింగ్ లో ఆయనకు ప్రమాదం జరిగింది. విశాల్ తాజా చిత్రం 'మార్క్ ఆంటొనీ' సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 

ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్.జే.సూర్య కీలక పాత్రను పోషిస్తున్నారు. విశాల్ కు ప్రమాదం జరగడంతో సినిమా షూటింగ్ ను తాత్కాలికంగా ఆపేశారు. విశాల్ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఆమధ్య 'లాఠీ' సినిమా షూటింగ్ లో కూడా విశాల్ రెండు సార్లు గాయపడ్డారు. రెండు సార్లు కూడా కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకుని మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నారు. సినిమాల కోసం ఎంతటి రిస్క్ తీసుకోవడానికైనా విశాల్ ముందుంటారు. ఫైటింగ్ సీన్లలో కూడా డూప్ లేకుండా నటించేందుకు ప్రాధాన్యతను ఇస్తుంటారు. ఈ క్రమంలోనే, ఆయన తరచుగా ప్రమాదాలకు గురవుతుంటారు.

Vishal
Tollywood
Kollywood
Accident
  • Loading...

More Telugu News