Tabu: షూటింగ్ లో గాయపడిన సీనియర్ నటి టబు

Senior actress Tabu injured in shooting

  • అజయ్ దేవగణ్ హీరోగా భోలా
  • హైదరాబాదులో షూటింగ్
  • టబుపై చేజింగ్ సీన్ల చిత్రీకరణ
  • ట్రక్కు అద్దాలు పగిలి టబు నుదుట గుచ్చుకున్న వైనం

సీనియర్ నటి టబు ఓ సినిమా చిత్రీకరణ సందర్భంగా గాయాలపాలైంది. ఆమె ప్రస్తుతం అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో వస్తున్న 'భోలా' చిత్రంలో నటిస్తోంది. ఇందులో టబు ఓ పోలీస్ అధికారిణి. ఆమెపై హైదరాబాదులో చేజింగ్ సీన్ చిత్రీకరిస్తుండగా ఘటన చోటుచేసుకుంది. 

ట్రక్కు అద్దాలు పగిలిపోవడంతో టబు నుదుటిపైనా, కంటికి దగ్గరగా గాయాలయ్యాయి.  అయితే కంటికి ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో యూనిట్ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన టబును యూనిట్ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. 

అటు, మరో సీనియర్ నటి శిల్పాశెట్టి కూడా ఓ వెబ్ సిరీస్ చిత్రీకరణలో గాయపడడం తెలిసిందే. స్టంట్ సీన్ చిత్రీకరణలో శిల్పాకు కాలు విరిగింది.

Tabu
Injury
Shooting
Bhola
Hyderabad
Bollywood
  • Loading...

More Telugu News