Poorna: పెళ్లి రద్దు అంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన పూర్ణ

Poorna reacts to marriage cancel speculations
  • నటిగా గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ
  • గత జూన్ లో నిశ్చితార్థం
  • షనీద్ ఆసిఫ్ అలీని పెళ్లాడనున్న పూర్ణ
మలయాళంలో షామ్నా ఖాసిం.... తెలుగులో పూర్ణ. శ్రీమహాలక్ష్మి చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయిన పూర్ణ పలు చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కాగా, పూర్ణ నిశ్చితార్థం గత జూన్ మాసంలోనే జరిగింది. యూఏఈకి చెందిన బిజినెస్ మేన్ షనీద్ ఆసిఫ్ అలీను ఆమె పెళ్లి చేసుకోనుంది. 

అయితే, వీరి పెళ్లి రద్దు అయిందంటూ ఇటీవల కథనాలు వస్తున్నాయి. దీనిపై పూర్ణ స్పందించింది. ఒక్క ఫొటోతో ఊహాగానాలన్నింటికి చెక్ పెట్టింది. 'ఎప్పటికీ అతడు నా వాడే..' అంటూ ఫొటోపై కామెంట్ చేసింది. అంతేకాదు, లవ్ సింబల్స్ కూడా పోస్టు చేసి తమ అనుబంధం మరింత ప్రేమాస్పదం అని పేర్కొంది. ఆ ఫొటోలో పూర్ణ, షనీద్ సన్నిహితంగా ఉండడాన్ని చూడొచ్చు.
Poorna
Shamna Kasim
Marriage
Speculations
Tollywood

More Telugu News