Venkaiah Naidu: వెంకయ్యను కలిసి శుభాభినందనలు తెలిపిన విజయ సాయిరెడ్డి
![ysrcpp leader vijay sai reddy lauded venkaiah naidu as vice president of inida](https://imgd.ap7am.com/thumbnail/cr-20220810tn62f3d6060be2b.jpg)
- ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన వెంకయ్య
- వెంకయ్యను స్వయంగా వెళ్లి కలిసిన సాయిరెడ్డి
- వెంకయ్య పనితీరును ఆకాశానికెత్తేసిన వైసీపీ ఎంపీ
భారత ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన ముప్పవరపు వెంకయ్యనాయుడిని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి బుధవారం స్వయంగా వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతిగా వెంకయ్య పనితీరును సాయిరెడ్డి కీర్తించారు. బుధవారం నుంచి నూతన జీవితాన్ని ప్రారంభించిన వెంకయ్యకు దేవుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఈ సందర్భంగా సాయిరెడ్డి ఆకాంక్షించారు.
రాజ్యసభలో క్రమశిక్షణను పాదుకొల్పడంలో వెంకయ్య సఫలీకృతం అయ్యారని సాయిరెడ్డి పేర్కొన్నారు. అదే సమయంలో సభా సంఘాల పనీతీరును మెరుగు పరచడంతో పాటుగా రాజ్యసభలో అర్థవంతమైన చర్చలు జరిగేలా వెంకయ్య చేసిన కృషి అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.