Hyundai Tucson: హ్యుందాయ్ 'టూసాన్' కొత్త వెర్షన్ విడుదల

2022 Hyundai Tucson launched

  • దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.27.69 లక్షలు
  • కారు ముందు భాగంలో కొత్తదనం
  • డ్యాష్ బోర్డులోనూ మార్పులు
  • డ్రైవర్ కు సాయం చేసే వ్యవస్థలు

హ్యుందాయ్ తన నాలుగో తరం టూసాన్ ఎస్ యూవీని 2022ను బుధవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.27.69 లక్షలు. ప్రపంచవ్యాప్తంగా హ్యుందాయ్ వాహన శ్రేణిలో టూసాన్ అత్యధికంగా అమ్ముడుపోతున్న మోడల్ కావడం గమనార్హం. ఇది భారత మార్కెట్లో జీప్, కాంపాస్, సిట్రోయిన్ సీ5 ఎయిర్ క్రాస్, ఫోక్స్ వాగన్ టైగూన్ కు పోటీ ఇవ్వనుంది.

మూడో వెర్షన్ తో పోలిస్తే తాజా వెర్షన్ టూసాన్ చూడ్డానికి కొత్తగా కనిపిస్తోంది. భద్రతా సదుపాయాలను కూడా ఈ కారులో పెంచారు. కారు నడిపే సమయంలో డ్రైవర్ పని సులభతరం చేసేందుకు వీలుగా అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ముందు భాగంలో గ్రిల్, ఎల్ఈడీ లైట్ల పరంగా మార్పులు చోటు చేసుకున్నాయి. 10.1 అంగుళాల డ్రైవర్ డిస్ ప్లే ఉంటుంది. అలాగే, ఇంతే సైజుతో ఉన్న ఇన్ఫోటెయిన్ మెంట్ స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. డ్యాష్ బోర్డ్ లేఅవుట్ కూడా మారింది. ఇప్పటి వరకు హ్యుందాయ్ 70 లక్షల టూసాన్ వాహనాలను విక్రయించింది.

Hyundai Tucson
2022 version
launched
new features
  • Loading...

More Telugu News