Bellamkonda Ganesh: దసరా బరిలో 'స్వాతిముత్యం'

Swathimuthyam Movie Update

  • హీరోగా బెల్లంకొండ గణేశ్ ఎంట్రీ 
  • 'స్వాతిముత్యం'గా ప్రేక్షకుల ముందుకు
  • కథానాయికగా వర్ష బొల్లమ్మ 
  • అక్టోబర్ 5వ తేదీన సినిమా విడుదల

బెల్లంకొండ గణేశ్ 'స్వాతిముత్యం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సితార బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో గణేశ్ జోడీగా వర్ష బొల్లమ్మ కనిపించనుంది. ఈ సినిమా విడుదలకు ముస్తాబై కొంతకాలమవుతోంది. అయితే సరైన రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తూ వచ్చింది. 

ఈ మధ్య ఒక రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు .. కాకపోతే పరిస్థితులు అనుకూలంగా లేవని వాయిదా వేశారు. కొంతసేపటి క్రితం ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. 'దసరా' పండుగ సందర్భంగా ఈ సినిమాను అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు.

లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి వచ్చిన శ్రీనివాస్ మాస్ హీరోగా మంచి ఇమేజ్ ను తెచ్చుకున్నాడు. 'ఛత్రపతి' రీమేక్ తో శ్రీనివాస్ బాలీవుడ్ కి పరిచయమవుతుండగా, ఆయన తమ్ముడు టాలీవుడ్ కి పరిచయమవుతుండటం విశేషం..

Bellamkonda Ganesh
Varsha Bollamma
lakshman Krishna
  • Loading...

More Telugu News