West Bengal: ఆత్మహత్యకు యత్నించిన బెంగాలీ నటుడు.. ఆసుపత్రికి తరలింపు

Bengali Actor Saibal Bhattacharya Tried To End His Life

  • బెంగాలీ చిత్రపరిశ్రమను కలవరపెడుతున్న ఆత్మహత్యలు
  • తన ఆత్మహత్యకు భార్య, అత్తమామలే కారణమంటూ ఫేస్‌బుక్‌లో వీడియో
  • చిత్తరంజన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు

బెంగాలీ నటుడు సాయిబాల్ భట్టాచార్య ఆత్మహత్యకు యత్నించారు. సోమవారం రాత్రి కస్బాలోని తన నివాసంలో ఆత్మహత్యకు యత్నించారు. మద్యం మత్తులో భట్టాచార్య తనను తాను గాయపర్చుకున్నారని పోలీసులు తెలిపారు. వెంటనే ఆయనను చిత్తరంజన్ ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. నటుడు ఆత్మహత్యకు యత్నించడానికి ముందు ఫేస్‌బుక్‌లో ఓ వీడియో షేర్ చేశారు.

అందులో తన ఈ పరిస్థితికి తన భార్య, అత్తమామలే కారణమని ఆరోపించారు. ప్రస్తుతం ఆ వీడియో డిలీట్ అయింది. బెంగాలీ చిత్రపరిశ్రమకు చెందిన పలువురు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో పల్లవి దేవ్, బిదిషా డే మజుందార్, మోడల్, నటి మంజుషా నియోగి ఉన్నారు. ఇప్పుడు సాయిల్ భట్టాచార్య ఆత్మహత్యకు యత్నించారన్న వార్త కలకలం రేపుతోంది.

West Bengal
Saibal Bhattacharya
Suicide
  • Loading...

More Telugu News