Nithin: వాళ్ల ఫస్టు మూవీ నాతోనే చేశారు: నితిన్

Nithin Interview

  • పొలిటికల్ డ్రామాగా 'మాచర్ల నియోజకవర్గం'
  • నితిన్ సరసన ఇద్దరు కథానాయికలు 
  • అంజలి ఐటమ్ సాంగ్ ప్రత్యేమైన ఆకర్షణ 
  • ఈ నెల 12వ తేదీన సినిమా విడుదల   

నితిన్ హీరోగా 'మాచర్ల నియోజకవర్గం' సినిమా రూపొందింది. నితిన్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాతో, దర్శకుడిగా రాజశేఖర్ రెడ్డి పరిచయమవుతున్నాడు. నితిన్ సరసన నాయికగా కృతిశెట్టి .. కేథరిన్ నటించిన ఈ సినిమా, అవినీతి రాజకీయాలను టచ్ చేస్తూ సాగుతుంది. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. 

ఈ సినిమా ప్రమోషన్స్ లో నితిన్ మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నా ఫైట్స్ .. డాన్స్ చాలా కొత్తగా ఉంటాయి. అంజలితో చేసిన ఐటమ్ సాంగ్ కి ఇప్పటికే మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాకి శేఖర్ మాస్టర్.. జానీ మాస్టర్.. జీతూ మాస్టర్.. శోభి మాస్టర్ కొరియోగ్రఫీని అందించారు. ప్రతి సాంగ్ కూడా ప్రత్యేకంగా అనిపిస్తుంది. 

శేఖర్ మాస్టర్ .. జానీ మాస్టర్.. శోభి మాస్టర్ .. జీతూ మాస్టర్ అందరు కూడా నా సినిమాలతోనే టాలీవుడ్ కి పరిచయమయ్యారు. తమ ఫస్టు సాంగ్ ను నాతోనే చేశారు. వాళ్లందరితో కలిసి ఈ సినిమా చేయడం నాకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు.

Nithin
Krithi Shetti
Rajasekhar Reddy
Macharla Niyojakavargam Movie
  • Loading...

More Telugu News