lawrence: మైసూరు షెడ్యూలు పూర్తిచేసిన 'చంద్రముఖి 2'

Chandramukhi 2 Movie Update

  • హారర్ కామెడీ నేపథ్యంలో 'చంద్రముఖి 2'
  • లారెన్స్ సరసన ఐదుగురు నాయికలు 
  • నిన్నటితో మైసూర్ లో ఫస్టు షెడ్యూల్ పూర్తి 
  • వచ్చే వేసవిలో రిలీజ్ చేసే ఛాన్స్  

రజనీకాంత్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలలో 'చంద్రముఖి' ఒకటి. 2005లో వచ్చిన ఆ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి దర్శకుడు పి.వాసు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ వచ్చాడు. కానీ రజనీకాంత్ కొన్ని కారణాల వలన అందుకు ఒప్పుకోలేదు. 

దాంతో గతంలో లారెన్స్ తో 'శివలింగ' చేసి ఉన్న వాసు, 'చంద్రముఖి 2' సినిమా కోసం కూడా ఆయననే ఎంచుకున్నాడు. లారెన్స్ నేరుగా రజనీ దగ్గరికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకుని షూటింగుకు వెళ్లడం తెలిసిందే. ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను మైసూర్ లో ప్లాన్ చేశారు. లారెన్స్ తో పాటు ముఖ్య పాత్రధారులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

ఈ మేజర్ షెడ్యూల్ షూటింగ్ నిన్నటితో ముగిసింది. ఈ విషయాన్ని ఈ సినిమా టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో ఐదుగురు కథానాయికలు అలరించనున్నారు. వాళ్లలో 'చంద్రముఖి' ఎవరనేది తెలియవలసి ఉంది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. వచ్చే వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

lawrence
lakshmi Menon
P Vasu
Chandramukhi 2 Movie
  • Loading...

More Telugu News