Mahesh Babu: వైఎస్సార్, జగన్ అమేజింగ్ పీపుల్... అంటూ మహేశ్ బాబు చేసిన వ్యాఖ్యల వీడియో పంచుకున్న మంత్రి రోజా

Roja shares Mahesh Babu opinion on YSR and Jagan
  • నేడు మహేశ్ బాబు పుట్టినరోజు
  • శుభాకాంక్షలు తెలిపిన మంత్రి రోజా
  • మహేశ్ బాబు ఇంటర్వ్యూ క్లిప్పింగ్ తో ట్వీట్
బర్త్ డే బాయ్ మహేశ్ బాబుపై జన్మదిన శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. ఏపీ సాంస్కృతిక, పర్యాటక, యువజనాభివృద్ధి మంత్రి రోజా కూడా సూపర్ స్టార్ మహేశ్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు వ్యాఖ్యల వీడియోను పంచుకున్నారు.

గతంలో సాక్షి చానల్ కోసం మహేశ్ బాబును రోజా ఇంటర్వ్యూ చేసినప్పటి దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోలో... "వైఎస్సార్ పై మీ అభిప్రాయం ఏమిటి?" అని రోజా ప్రశ్నించారు. అందుకు మహేశ్ బాబు బదులిస్తూ... రాజకీయాలు పక్కనబెడితే  వైఎస్సార్ ను తాను వ్యక్తిగతంగా కలిశానని, తన తండ్రి కృష్ణకు వైఎస్సార్ కు మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉందని వెల్లడించారు. తాను వైఎస్సార్ ను కలిసిన సమయంలో జగన్ కూడా ఉన్నారని తెలిపారు. "నిజాయతీగా చెప్పాలంటే వాళ్లు అద్భుతమైన వ్యక్తులు" అని అభివర్ణించారు.
Mahesh Babu
Birthday
Roja
YSR
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News