Mahesh Babu: హృద్రోగంతో బాధపడే చిన్నారులకు మహేశ్ బాబు శస్త్రచికిత్సలు చేయించడం అభినందనీయం: పవన్ కల్యాణ్

Pawan Kalyan conveys birthday wishes to Mahesh Babu

  • నేడు మహేశ్ బాబు పుట్టినరోజు
  • ఓ ప్రకటన ద్వారా స్పందించిన పవన్ కల్యాణ్
  • తనదైన శైలిలో రాణిస్తున్నాడని కితాబు
  • మహేశ్ బాబు సేవా కార్యక్రమాల పట్ల అభినందన
  • తండ్రి బాటలోనే పయనిస్తున్నాడని కితాబు  

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. మహేశ్ బాబు తనదైన శైలి నటనతో నవతరం ప్రేక్షకులను మెప్పిస్తున్నారని తెలిపారు. మహేశ్ బాబు చేపట్టే సేవా కార్యక్రమాలు, హృద్రోగంతో బాధపడే చిన్నారులకు శస్త్రచికిత్సలు చేయించడం అభినందనీయం అని పేర్కొన్నారు. 

కృష్ణ గారి నట వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ, తండ్రి బాటలోనే దర్శకులకు, నిర్మాతలకు అండగా నిలుస్తున్నారని వివరించారు. అర్జున్ సినిమా సందర్భంగా పైరసీపై పోరాటానికి మహేశ్ బాబు తన గళం వినిపిస్తే ఆయనకు తాను మద్దతుగా నిలిచానని పవన్ గుర్తుచేశారు. పరిశ్రమను కాపాడేందుకు ఆయన ముందుకు రావడంతో తామందరం వెన్నంటి నిలిచామని వెల్లడించారు. 

జల్సా సినిమాలో సంజయ్ సాహు పాత్రను పరిచయం చేసేందుకు మహేశ్ బాబు నేపథ్యగాత్రం అయితే బాగుంటుందని భావించి, దర్శకుడు త్రివిక్రమ్ కోరగానే అంగీకరించి తన సహృదయత చాటుకున్నారని కొనియాడారు. కథానాయకుడిగా తనదైన పంథాలో వెళుతూ ప్రేక్షకుల మెప్పు, పురస్కారాలు అందుకుంటున్న మహేశ్ బాబు మరిన్న విజయాలు అందుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.

Mahesh Babu
Birthday
Pawan Kalyan
Wishes
Tollywood
  • Loading...

More Telugu News