Mahesh Babu: నేను గానీ .. త్రివిక్రమ్ గాని ఇంతవరకూ ఇలాంటి సినిమా చేయలేదు: మహేశ్

Mahesh Babu Interview

  • మహేశ్ 28వ సినిమాకి సన్నాహాలు 
  • త్వరలో సెట్స్  పైకి వెళ్లనున్న ప్రాజెక్టు 
  • డిఫరెంట్ జోనర్లో రూపొందనున్న సినిమా 
  • షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్నానన్న మహేశ్

మహేశ్ బాబు తన 28వ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో నిర్మితమవుతున్న మూడో సినిమా ఇది. అందువలన సహజంగానే అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అందుకునే దిశగానే త్రివిక్రమ్ సంసిద్ధమవుతున్నాడు. 

తాజాగా మహేశ్ బాబు మాట్లాడుతూ .. "నాకు త్రివిక్రమ్ గారి డైరెక్షన్ .. డైలాగ్స్ అంటే చాలా ఇష్టం. ఒక సినిమాను అన్ని వైపులా నుంచి తీర్చిదిద్దుకుంటూ రావడం ఆయన ప్రత్యేకత. పుష్కర కాలం తరువాత మళ్లీ కాంబినేషన్ సెట్ అయింది. ఆయనతో కలిసి మళ్లీ పని చేయడానికి నేను చాలా ఉత్సాహంతో ఉన్నాను.

ఈ సినిమా కోసం త్రివిక్రమ్ చాలా కొత్తదనం ఉన్న కథను ఎంచుకున్నాడు. డిఫరెంట్ జోనర్లో ఈ సినిమా ముందుకు వెళుతుంది. ఇంతవరకూ తనుగానీ .. నేను గాని అలాంటి ఒక సినిమా చేయలేదు. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగా ఉంటుందని హామీ ఇస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.

Mahesh Babu
Pooja Hegde
Trivikram Movie
  • Loading...

More Telugu News