Jagan: ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలిపిన జగన్, చంద్రబాబు

Jagan and Chandrababu greets Adivasis

  • ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
  • గిరిజనులకు ప్రాధాన్యతనిస్తూ రెండు జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామన్న జగన్
  • గిరిజన సంక్షేమం, హక్కుల పరిరక్షణకు టీడీపీ కృషి చేసిందనన్న చంద్రబాబు

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వారికి ఏపీ ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. కొండకోనల్లో ఉంటూ ప్రకృతిని కాపాడుతున్న అడవి బిడ్డలకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు అని జగన్ ట్వీట్ చేశారు. గిరిపుత్రుల జీవనశైలిని కాపాడుతూ సంక్షేమాభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గిరిజనులకు ప్రాధాన్యతనిస్తూ రెండు జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... ఆది నుంచి గిరిజన సంక్షేమం, గిరిజన హక్కుల పరిరక్షణలకు టీడీపీ కృషి చేసిందని చెప్పారు. గిరిజన ప్రాతం భూములు, ఉద్యోగాలు, అటవీ హక్కులు వంటి వాటి కోసం ఆనాడు ఎన్టీఆర్ 14 చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని జీవోలు తెచ్చారని అన్నారు. 'గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బైక్ అంబులెన్సులు ఇప్పుడు లేవు. అలాగే గిరిజన ప్రాంతాల్లో వారాంతపు సంతల్లో రోగులకు మెరుగైన వైద్యం కల్పించేందుకు ఏర్పాటు చేసిన మొబైల్‌ అంబులెన్స్‌ సేవలు కూడా ఇప్పుడు లేవు. ఇప్పటికీ తాగేందుకు గెడ్డ నీటినే ఉపయోగిస్తున్నారు గిరిజనులు. గెడ్డలో నీరు కలుషితమై గిరిజనులు జబ్బుల బారిన పడుతున్నా ప్రభుత్వం తాగునీటి సరఫరాకు ఎలాంటి ప్రయత్నమూ చేయడం లేదు. ఇప్పటికైనా గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి'

  • Loading...

More Telugu News