Krishnamachari Srikkanth: నేనే కనుక చీఫ్ సెలక్టర్ అయితే అతడ్ని ఎంచుకోను: కృష్ణమాచారి శ్రీకాంత్
- మమహ్మద్ షమీకి ఓటు వేసిన మాజీ ఓపెనర్
- రవి బిష్ణోయ్ ను ఎంపిక చేయబోనన్న శ్రీకాంత్
- కనీసం మరో మీడియం పేసర్ ఉండాలన్న అభిప్రాయం
- అక్షర్ పటేల్ మిస్ కావడం ఒక్కటే వెలితిగా ఉందని కామెంట్
ఆసియాకప్ 2022కు భాతర జట్టు ఎంపికపై టీమిండియా మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పెదవి విరిచాడు. 15 మందితో కూడిన బృందాన్ని బీసీసీఐ సోమవారం ప్రకటించడం తెలిసిందే. భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్ ను ఫాస్ట్ బౌలర్ల కింద తీసుకున్నారు. అదనపు బౌలింగ్ ఆప్షన్ గా హార్థిక్ పాండ్యా ఉన్నాడు.
ఈ జట్టు కూర్పుపై శ్రీకాంత్ స్పందిస్తూ, మహమ్మద్ షమీని తప్పించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. గాయాల కారణంగా అనుభవం కలిగిన జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ అందుబాటులో లేని తరుణంలో షమీని ఎంపిక చేయకపోవడాన్ని శ్రీకాంత్ తప్పుబట్టాడు. తాజా ఎంపికల నేపథ్యంలో మరో రెండు నెలల్లో జరిగే టీ20 ప్రపంచకప్ కు షమీని తీసుకునే అవకాశాలు కనిపించడం లేదన్న విశ్లేషణ వినిపిస్తోంది.