Madhav: రవితేజ ఫ్యామిలీ నుంచి కొత్త హీరో ఎంట్రీ!

Ey Pilla Movie Update

  • మరో ప్రేమకథ చిత్రంగా 'ఏయ్ పిల్లా'
  • హీరోగా మాధవ్ భూపతిరాజు ఎంట్రీ  
  • ఇతను రవితేజ సోదరుడి తనయుడు
  • కథానాయికగా రుబల్ షెకావత్ పరిచయం

ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఎంట్రీ ఇచ్చిన రవితేజ, చాలా ఫాస్టుగా స్టార్ హీరోగా ఎదిగాడు. ఒక రేంజ్ లో తన దూకుడు చూపిస్తూ వరుస సినిమాలు చేస్తూ వచ్చాడు. ఆల్రెడీ ఆయన 70 సినిమాలకు దగ్గరపడిపోయాడు. ప్రస్తుతం ఆయన ప్రాజెక్టులు మూడు సెట్స్ పై ఉన్నాయి. ఈ నేపథ్యంలో రవితేజ ఫ్యామిలీ నుంచి మరో హీరో రావడానికి రెడీ అవుతున్నాడు.

రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ భూపతిరాజు హీరోగా పరిచయమవుతున్నాడు. ఆయన హీరోగా నల్లమలుపు శ్రీనివాస్ ఒక ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రమేశ్ వర్మ కథను అందించిన ఈ సినిమాకి లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. 

తాజాగా ఈ సినిమాకి 'ఏయ్ పిల్లా' అనే  టైటిల్ ను ఖరారు చేశారు. హీరో, హీరోయిన్లకి సంబంధించిన ఒక పోస్టర్ ను వదిలారు. పోస్టర్ తోనే యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాతో, రుబల్ షెకావత్ తెలుగు తెరకి కథానాయికగా పరిచయమవుతోంది..

Madhav
Rubal
Ludheer
Ey Pilla Movie
  • Loading...

More Telugu News