Lakshyasen: కామన్వెల్త్ బ్యాడ్మింటన్ లో పురుషుల సింగిల్స్ స్వర్ణం కూడా మనదే... లక్ష్యసేన్ అద్భుత విజయం

Lakshyasen clinches badminton men singles gold

  • ఇప్పటికే మహిళల సింగిల్స్ స్వర్ణం నెగ్గిన సింధు
  • పురుషుల సింగిల్స్ ఫైనల్లో పోరాడి నెగ్గిన లక్ష్యసేన్ 
  • తొలి గేము కోల్పోయినా సడలని స్థైర్యం
  • వరుసగా రెండు గేములు నెగ్గి స్వర్ణం సాధించిన వైనం

బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ బ్యాడ్మింటన్ లో పసిడిమోత మోగించింది. మహిళల సింగిల్స్ లో పీవీ సింధు స్వర్ణం చేజిక్కించుకుని యావత్ భారతావనిని సంతోషంలో ముంచెత్తగా, లక్ష్యసేన్ పురుషుల సింగిల్స్ లో పసిడి పతకం నెగ్గి దేశ ప్రజల ఆనందాన్ని ఇనుమడింపజేశాడు. 

లక్ష్యసేన్ ఇవాళ జరిగిన ఫైనల్లో మలేషియాకు చెందిన ట్సే యోంగ్ ఎన్జీపై విజయం సాధించాడు. తొలి గేమ్ ను 19-21తో కోల్పోయిన లక్ష్యసేన్ ఆ తర్వాత విజృంభించాడు. వరుసగా 21-9, 21-16తో రెండు గేములు చేజిక్కించుకుని కామన్వెల్త్ క్రీడల్లో చిరస్మరణీయ విజయం సాధించాడు.

Lakshyasen
Gold
Badminton
Singles
Commonwealth Games
India
  • Loading...

More Telugu News