Nikhil: 'కలర్స్' స్వాతిని కావాలని పక్కన పెట్టలేదు: నిఖిల్

Nikhil Interview

  • గతంలో విజయాన్ని అందుకున్న 'కార్తికేయ'
  • సీక్వెల్ గా ఈ నెల 13న రానున్న 'కార్తికేయ 2'
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నిఖిల్ 
  • అనుపమను తీసుకుకోవడానికి గల కారణం వెల్లడించిన హీరో  

నిఖిల్ హీరోగా చేసిన 'కార్తికేయ' ఆయన కెరియర్లోనే ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. అలాంటి సినిమాకి సీక్వెల్ గా ఆయన 'కార్తికేయ 2' చేశాడు. ఈ సినిమా ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో నిఖిల్ బిజీగా ఉన్నాడు. ఫస్టు పార్టుకు 'కలర్స్' స్వాతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అందువలన సీక్వెల్లో స్వాతినే కథానాయికగా ఉంటుందని అంతా భావించారు. ఫస్టు పార్టుకు కొనసాగింపుగానే ఈ సినిమా ఉంటుందని నిఖిల్ చెప్పడంతో స్వాతి రీ ఎంట్రీ ఖాయమని అనుకున్నారు. కానీ ఆ ప్లేస్ లో అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నారు. దాంతో స్వాతిని పక్కనపెట్టేశారనే ప్రచారం నడిచింది. 

ఈ విషయంపై నిఖిల్ స్పందిస్తూ .. "కథా పరంగా ఈ సినిమాకి నార్త్ ఇండియన్ లుక్ ఉన్న అమ్మాయి కావాలి. అందువలన అనుపమ పరమేశ్వరన్ ను తీసుకోవడం జరిగింది. అంతేగానీ స్వాతిని కావాలని పక్కన పెట్టలేదు" అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ అడిగినా స్వాతి చేసేదో లేదో .. ఎందుకంటే పెళ్లి తరువాత ఆమె నటనకి దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే.

More Telugu News