Dulquer Salmaan: దుల్కర్ జోడీ కడుతున్న సమంత

Samantha  in Dulquer Movie

  • త్వరలో సమంత నుంచి రానున్న 'యశోద'
  • లైన్లోనే ఉన్న గుణశేఖర్ 'శాకుంతలం'
  • షూటింగు దశలో ఉన్న 'ఖుషి'
  • మలయాళ సినిమాకి గ్రీన్ సిగ్నల్ 
  • వచ్చేనెల నుంచి సెట్స్ పైకి  

సమంత నుంచి రావడానికి 'యశోద' .. 'శాకుంతలం' సినిమాలు రెడీ అవుతున్నాయి. ఇక విజయ్ దేవరకొండ సరసన నాయికగా ఆమె 'ఖుషి' చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక మరో వైపున ఆమె బాలీవుడ్ ప్రాజెక్టులను కూడా లైన్లో పెట్టే పనిలో ఉంది. ఈ నేపథ్యంలోనే మలయాళంలో ఆమె ఒక సినిమా చేయడానికి అంగీకరించిందనేది టాక్. 
 
'సీతా రామం' సినిమాతో లుక్ పరంగా .. నటన పరంగా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన దుల్కర్, వచ్చేనెల నుంచి ఒక మలయాళ సినిమాతో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా సమంతను తీసుకున్నారని తెలుస్తోంది. 

లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టయినర్ గా రూపొందే ఈ సినిమాకి అభిలాష్ జోషీ దర్శకత్వం వహించనున్నాడు. మలయాళంతో పాటు తమిళ .. తెలుగు భాషల్లోను ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. మొత్తానికి సమంత మొదటిసారిగా మలయాళంలోకి అడుగుపెడుతోంది. అక్కడ కూడా ఇదే రేంజ్ లో రాణిస్తుందేమో చూడాలి.

Dulquer Salmaan
Samantha
Abhilash
  • Loading...

More Telugu News