Bandla Ganesh: పవన్ కల్యాణ్ పై బండ్ల గణేశ్ వరుస ట్వీట్స్

Bandla Ganesh tweets on Pawan Kalyan

  • వపన్ ను సాక్షాత్తు దైవంగా భావించే బండ్ల గణేశ్ 
  • మరోసారి ఆయనపై స్వామి భక్తిని చాటుకున్న బండ్ల
  • టాలీవుడ్ రికార్డులు తిరగరాసే సినిమా తీయాలని కోరుకుంటున్నానని ట్వీట్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సినీ నిర్మాత బండ్ల గణేశ్ కు ఎంత అభిమానం ఉందో అందరికీ తెలిసిందే. వపన్ ను ఆయన సాక్షాత్తు దేవుడిగానే భావిస్తుంటారు. సమయం వచ్చినప్పుడల్లా పవన్ పై ఉన్న అభిమానాన్ని ఆయన చాటుకుంటూనే ఉంటారు. తాజాగా మరోసారి తన స్వామి భక్తిని ట్విట్టర్ ద్వారా చాటుకున్నారు. 

మిమ్మల్ని అర్థం చేసుకుని, మిమ్మల్ని ప్రేమిస్తూ, మీ ప్రేమను పొందుతూ సినిమా తీస్తే బాక్స్ బద్దలే అని అని ట్వీట్ చేశారు. తన దైవ సమానులైన పవన్... తెలుగు చలన చిత్ర చరిత్రలో రికార్డులు తిరగరాసే సినిమాను త్వరగా తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

Bandla Ganesh
Tollywood
Pawan Kalyan
Janasena

More Telugu News