Corona Virus: దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. మళ్లీ 20 వేల చేరువలో కేసులు
- గత 24 గంటల్లో19,406 పాజిటివ్ కేసులు నమోదు
- దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 1,34,793
- వైరస్ వల్ల తాజాగా 38 మంది మృతి
మన దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. మూడు రోజులగా కాస్త అటు ఇటుగా 20 వేల కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో తాజాగా 19,406 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొన్నటితో పోలిస్తే 571 కేసులు తగ్గాయి. వైరస్ వల్ల కొత్తగా 38 మంది మృతిచెందారు. అదే సమయంలో 19,928 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,34,793 క్రియాశీల కేసులు ఉన్నాయి. క్రియాశీల రేటు 0.31 శాతంగా ఉంది.
దేశ వ్యాప్తంగా వైరస్ బారిన పడిన వారిలో 4,34,65,552 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.50 శాతంగా నమోదైంది. కరోనా వల్ల ఇప్పటిదాకా 5,26, 649 మంది మృది చెందారు. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,05,92,20,794 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 32,73,551 మందికి వ్యాక్సిన్ అందించారు.