: సంక్రాంతికి 'జంప్ జిలానీ'
అల్లరి నరేష్ కధానాయకుడుగా మరో హాస్యరసప్రధాన సినిమా రాబోతోంది. ఎమ్మెల్యే అంబికా కృష్ణ నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమా పేరు 'జంప్ జిలానీ'. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆగష్టునుంచి చిత్రీకరణ ప్రారంభించనున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నామని తెలిపారు. ఈ సినిమాకు ఇ. సత్తిబాబు దర్శకత్వం వహించనున్నారని తెలిపారు.