Adhithi Shankar: హీరోయిన్ గా తెలుగు తెరకి శంకర్ కూతురు!

Adithi Shankar movies  updates

  • కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న అదితి శంకర్ 
  • కార్తి జోడీగా మొదటి సినిమా 
  • శివకార్తికేయన్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ 
  • తెలుగు సినిమాకి సైన్ చేసిందంటూ టాక్

తమిళ డైరెక్టర్ శంకర్ గురించి తెలియనివాళ్లంటూ ఉండరు. సౌత్ సినిమాను ప్రపంచపటానికి పరిచయం చేసిన దర్శకుడు ఆయన. ఇప్పుడు వినిపిస్తోన్న పాన్ ఇండియా తరహా సినిమాలను ఆయన చాలా కాలం క్రితమే తీశాడు. శంకర్ ఒక కథపై చేసే కసరత్తు ఒక రేంజ్ లో ఉంటుంది. అందువల్లనే ఆ సినిమాలకు ఆ స్థాయి ఆదరణ లభిస్తూ ఉంటుంది.

అలాంటి శంకర్ ఫ్యామిలీ నుంచి కథానాయికగా అదితి శంకర్ కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కార్తి కథానాయకుడిగా నటించిన 'విరుమన్' సినిమా ద్వారా ఆమె తమిళ తెరకి పరిచయం కానుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆమె శివకార్తికేయన్ జోడిగా 'మావీరన్' సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

ఇక అదితి శంకర్ తెలుగులో ఒక సినిమా చేయడానికి అంగీకరించిందనేది తాజా సమాచారం. పెద్ద బ్యానర్లో  .. పేరున్న హీరో సరసన ఆమె ఎంట్రీ ఉండనుందని అంటున్నారు. శంకర్ కూతురంటే ఎలా ఉంటుందా .. ఎలా చేస్తుందా అనే ఆసక్తి ఇక్కడ కూడా ఉండటం సహజం. అదితి శంకర్ తెలుగు ప్రాజెక్టు ఏమిటనేది త్వరలో తెలియనుంది.

Adhithi Shankar
Karthi
Shivakarthikeyan
  • Loading...

More Telugu News