: కర్ణాటక నుంచి 2,479 కోట్లు నష్టపరిహారం ఇప్పించండి: సుప్రీంకోర్టును కోరిన తమిళనాడు


కావేరీ నదీ జలాలను 2012-13 సంవత్సరానికి కర్ణాటక విడుదల చేయకపోవడంతో తమిళనాడులో పంటలు పండలేదని, రైతులు తీవ్రంగా నష్టపోయారని, రాష్ట్రం విద్యుదుత్పత్తిని సాధించలేకపోయిందని, దీంతో ప్రజల విద్యుద్దవసరాలు తీర్చలేక పోయామని ఆరోపిస్తూ కర్ణాటక నుంచి పంటకు నష్టపరిహారంగా 2,500 కోట్లు ఇప్పించాలంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కావేరీ జలాల ట్రిబ్యునల్ మధ్యంతర అవార్డు ప్రకారం నీరు విడుదల చేయకపోవడంతో పంటనష్టం, విద్యుదుత్పత్తి నష్టం, బయోమాస్ నష్టం రూపేణా 1,045.7 కోట్లు, శిక్షణాత్మక నష్టపరిహారం కింద 1,434 కోట్లు ఇప్పించాలని కోరింది.

  • Loading...

More Telugu News