Nikhil: పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేసిన అనుపమ!

Karthikeya 2 movie update

  • 'కార్తికేయ 2' కథానాయికగా అనుపమ
  • ఈ నెల 13వ తేదీన సినిమా విడుదల
  • ప్రమోషన్స్ కి హాజరవుతున్న అనుపమ
  • తాను అందుబాటులో లేకపోవడానికి కారణం అదేనంటూ వ్యాఖ్య

నిఖిల్ హీరోగా రూపొందిన 'కార్తికేయ 2' ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, నిఖిల్ జోడీగా అనుపమ పరమేశ్వరన్ అలరించనుంది. నిన్నమొన్నటివరకూ ఈ సినిమా ప్రమోషన్స్ లో అనుపమ పరమేశ్వరన్ కనిపించలేదు. 

"అనుపమ సెట్లో చాలా కలివిడిగా ఉంటుందనీ .. ఆ తరువాత మాత్రం కాల్ చేస్తే ఫోన్ కూడా తీయదనీ .. ప్రమోషన్స్ కి ఎందుకు రావడం లేదో తనకి అర్థం కావడంలేదని ఒక ఇంటర్వ్యూలో నిఖిల్ అన్నాడు. నిఖిల్ కీ .. అనుపమకి మధ్య ఏదో గొడవ జరిగి ఉంటుందనీ, అందువలన ఆమె రావడం లేదనే ప్రచారం జరుగుతోంది. 

'కార్తికేయ 2' సినిమా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ లేకపోవడం వలన తాను అందుబాటులో లేను అంటూ అనుపమ రీసెంట్ గా ఎంట్రీ  ఇచ్చింది. రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ వచ్చిన దగ్గర నుంచి ఆమె కూడా ప్రమోషన్స్ పాల్గొంటోంది. మొత్తానికి పుకారు జోరందుకునే సమయానికి అనుపమ సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చేసి ఫుల్ స్టాప్ పెట్టేసింది.

Nikhil
Anupama
Chandu Mondeti
Karthikeya 2
  • Loading...

More Telugu News