Dulquer Salmaan: థియేటర్లకు రండి డాళింగ్: ప్రభాస్

Sita Ramam Movie Update

  • సింపుల్  గా జరిగిన 'సీతా రామం' ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ముఖ్య అతిథిగా వచ్చిన ప్రభాస్
  • పొయెట్రీ లాంటి ప్రేమకథ అంటూ వ్యాఖ్య 
  • థియేటర్స్ లో మాత్రమే చూడవలసిన సినిమా అంటూ కితాబు 

దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి రూపొందించిన 'సీతా రామం' ఈ నెల 5వ తేదీన ప్రీక్షకుల ముందుకు రానుంది. నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రభాస్ మాట్లాడుతూ .. ప్రేమ .. యుద్ధం .. ఈ రెండూ ఈ సినిమాలో ఉన్నాయనీ, ఈ సినిమా షూటింగును రష్యా .. కశ్మీర్ లలో చేశారనీ అన్నారు. తనకు తెలిసి రష్యాలో షూట్ చేసిన తొలి తెలుగు సినిమా ఇదేనని అనుకుంటున్నానన్నారు.

"ఈ సినిమా కోసం భారీ మొత్తంలోనే ఖర్చు చేసినట్టుగా అనిపిస్తోంది.  డైరెక్టర్ ఓ పొయెట్రీలా ఈ సినిమాను తీశాడనే విషయం అర్థమవుతోంది. అశ్వనీ దత్ గారు దాదాపు 50 ఏళ్లుగా గొప్ప గొప్ప సినిమాలు చేస్తూ వస్తున్నారు. అలాంటి ఒక నిర్మాత ఉండటం టాలీవుడ్ చేసుకున్న అదృష్టం" అన్నారు ప్రభాస్. 

"కొన్ని సినిమాలను థియేటర్లలోనే చూడాలి .. అలాంటి సినిమానే ఇది. ఇంట్లో పూజా మందిరం ఉంది కదా అని గుడికి వెళ్లడం మానుకోము గదా .. సినిమా వాళ్లకి థియేటర్ గుడిలాంటిది. మంచి ఆర్టిస్టులు .. గొప్ప టెక్నీషియన్స్ కలిసి పనిచేసిన సినిమా ఇది. కనుక థియేటర్స్ కి రండి డాళింగ్ .." అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు.

Dulquer Salmaan
Mrunalini
Rashmika Mandanna
Sita Ramam Movie
  • Loading...

More Telugu News