TDP: వైసీపీ సోషల్ మీడియా పోస్టులపై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులకు టీటీడీపీ ఫిర్యాదు
![ttdp leader pogaku jayaram complaints ysrcp social media posts to ts cyber crime](https://imgd.ap7am.com/thumbnail/cr-20220803tn62ea99235a28a.jpg)
- 2 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న ఉమా మహేశ్వరి
- ఆమె మరణంపై సోషల్ మీడియాలో వైసీపీ నేతల పోస్టులు
- ఆ పోస్టులపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసిన పొగాకు జయరామ్
టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు చిన్న కుమార్తె ఉమా మహేశ్వరి ఆత్మహత్యపై ఏపీలోని అధికార పార్టీకి చెందిన నేతలు సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులపై టీడీపీ తెలంగాణ శాఖ బుధవారం తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉమా మహేశ్వరి మృతిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ తెలంగాణ తెలుగు యువత అధ్యక్షుడు పొగాకు జైరామ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు ఫిర్యాదుల ప్రతులను టీడీపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.