Andhra Pradesh: తెలంగాణ‌లో ఏపీ స్థిరాస్తి వ్యాపారి ఆత్మ‌హ‌త్య‌

ap realtor commits suicide in telangana

  • కాప్రాలో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డ గిరిధ‌ర్ వ‌ర్మ‌
  • గుంటూరు జిల్లా కొరిక‌పాడుకు చెందిన వ్యక్తిగా గుర్తింపు
  • రుణ దాత‌ల వేధింపులు త‌ట్టుకోలేకే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డుతున్న‌ట్లు వెల్ల‌డి

ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన స్థిరాస్తి వ్యాపారి గిరిధ‌ర్ వ‌ర్మ తెలంగాణ‌లో బుధ‌వారం ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. గుంటూరు జిల్లా కొరిక‌పాడుకు చెందిన గిరిధ‌ర్ వ‌ర్మ అప్పుల వేధింపులు త‌ట్టుకోలేక కొంత కాలం క్రితం తెలంగాణ‌లోని మేడ్చ‌ల్ జిల్లా కాప్రాకు వ‌చ్చి ఉంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న బుధ‌వారం కాప్రాలో తాను ఉంటున్న ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు.

ఆత్మ‌హ‌త్య‌కు ముందు గిరిధ‌ర్ వ‌ర్మ ఓ సూసైడ్ లెట‌ర్ రాసినట్టు తెలుస్తోంది. ఈ లేఖ‌లో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఉద్దేశిస్తూ ప‌లు అంశాలు ప్ర‌స్తావించారు. తాను తీసుకున్న అప్పును చెల్లించిన‌ప్ప‌టికీ రుణ దాత‌లు త‌న‌ను వేధిస్తున్నార‌ని అందులో పేర్కొన్నారు. రుణ దాత‌ల వేధింపులు త‌ట్టుకోలేకే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

Andhra Pradesh
Telangana
Medchal Malkajgiri District
Kapra
Real Estate
YSRCP
YS Jagan
  • Loading...

More Telugu News