Nikhil: అనుపమకు ఈ హిట్టు చాలా అవసరం!

Karthikeya 2 movie update

  • కెరియర్ పరంగా కాస్త వెనకబడిన అనుపమ
  • ఈ నెల 13వ తేదీన రానున్న 'కార్తికేయ 2'
  • ఆశలన్నీ ఆ సినిమా పైనే
  • లైన్లో '18 పేజెస్' .. 'బటర్ ఫ్లై' సినిమాలు  

తెలుగు ప్రేక్షకులలో అనుపమ పరమేశ్వరన్ కు మంచి క్రేజ్ ఉంది. 'అ ఆ' .. 'ప్రేమమ్' .. 'శతమానం భవతి' వంటి హిట్లు ఆమె ఖాతాలో ఉన్నాయి. 2019లో ఆమె నుంచి వచ్చిన 'రాక్షసుడు' హిట్ అయిందిగానీ, ఆ హిట్ ఆమె ఖాతలోకి వెళ్లలేదు. ఎందుకంటే ఆ సినిమాలో ఆమె కథానాయిక ప్లేస్ లో కనిపించలేదు.

ఆ తరువాత ఆమె చేసిన సినిమా 'కార్తికేయ 2'నే. ఈ సినిమాను ఈ నెల 13వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఒప్పుకున్న ప్రాజెక్టులు సరైన సమయంలో పూర్తికాకపోవడం వలన .. కొత్త కథానాయికల కారణంగా అవకాశాలు తగ్గడం వలన ఇప్పటికే అనుపమకు చాలా గ్యాప్ వచ్చేసింది.

అందువలన 'కార్తికేయ 2' తప్పకుండా హిట్టుకొట్టవలసిన అవసరం ఉంది. ఈ సినిమా ఆమెను నిలబెట్టాలిసిందే. ఆ తరువాత ప్రాజెక్టులుగా '18 పేజెస్' .. 'బటర్ ఫ్లై' లైన్లో ఉన్నప్పటికీ, ఆమె కెరియర్ గ్రాఫ్ ను పరిగెత్తించవలసిన బాధ్యత 'కార్తికేయ 2'పైనే ఉంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ఆమె నిరీక్షణ ఫలిస్తుందేమో చూడాలి.

Nikhil
Anupama
Karthikeya 2 Movie
  • Loading...

More Telugu News