Vivo: త్వరలో మార్కెట్లోకి వివో వీ 25 ప్రో.. ఓఐఎస్​ సహా ప్రత్యేకతలెన్నో

Vivo v25 pro specifications here

  • గూగుల్ ప్లే కన్సోల్, ఐఎంఈఐ రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగా టెక్ వెబ్ సైట్ల అంచనాలు
  • ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా.. 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా
  • ఆగస్టు 25వ తేదీ నుంచి విక్రయాలు ప్రారంభమయ్యే అవకాశం

మధ్యశ్రేణి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన వివో సంస్థ తయారు చేసిన వివో వీ25 ప్రో స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ప్రత్యేకతలు లీకయ్యాయి. గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్, ఐఎంఈఐ నంబరింగ్ కోసం అప్లై చేసిన వివరాల ఆధారంగా వివో వీ25, వీ25 ప్రో ఫోన్లకు సంబంధించిన ప్రత్యేకతలను ప్రఖ్యాత మొబైల్ టెక్ వెబ్ సైట్లు బహిర్గతం చేశాయి. ఆగస్టు 17వ తేదీన దీనిని అధికారికంగా ప్రకటించనున్నారని.. 25వ తేదీ నుంచి విక్రయాలు మొదలయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

ఫోన్ ప్రత్యేకతల వివరాలివీ..
  • వివో వీ 25 ప్రో ఫోన్ లో మీడియా టెక్ డైమన్సిటీ 1300 ప్రాసెసర్, మాలి జీ77 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటాయి. 8 జీబీ నుంచి 12 జీబీ వరకు ర్యామ్ తో మోడళ్లు అందుబాటులో ఉంటాయి.
  • వివో వీ25 సాధారణ మోడల్ లో మీడియా టెక్ డైమన్సిటీ 900 ప్రాసెసర్, మాలి జీ68 ప్రాసెసర్ ఉంటాయని టెక్ వెబ్ సైట్లు పేర్కొన్నాయి.
  • ఫోన్ ఆరున్నర అంగుళాల పరిమాణంలో ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లేతో ఉండనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టం లోడ్ అయి రానుంది.
  • డిస్ ప్లే పైభాగంలో మధ్యన పంచ్ హోల్ విధానంలో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుందని టెక్ వెబ్ సైట్లు తెలిపాయి.
  • ఫోన్ వెనుక భాగంలో 64 మెగాపిక్సెల్ సామర్థ్యంతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుందని పేర్కొన్నాయి. అయితే వెనుక మెయిన్ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) ఉంటుందని.. దీనివల్ల చేతులు కాస్త కదులుతూ ఫొటో తీసినా, బ్లర్ కాకుండా స్పష్టమైన ఫొటోలు తీసే వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నాయి.
  • అయితే ఈ ఫోన్ ధర ఎంత వరకు ఉండవచ్చన్న దానిపై ఎలాంటి అంచనాలూ వెలువడలేదు. మధ్య స్థాయి బడ్జెట్ కు అందుబాటులో ఈ ఫోన్ ఉంటుందని మాత్రం టెక్ వెబ్ సైట్లు అంచనా వేశాయి. 

Vivo
Vivo v25 pro
Vivo v25 pro specifications
Tech-News
India
Smart phone
Offbeat
  • Loading...

More Telugu News