Congress: రాజ‌గోపాల్ రెడ్డి వెంట వెళుతున్నార‌ని... మునుగోడులో నాలుగు మండ‌లాల అధ్య‌క్షుల‌పై కాంగ్రెస్ వేటు

congress suspends 4 mandal presidents in munugodu assembly

  • ఎమ్మెల్యే ప‌ద‌వితో పాటు కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన రాజ‌గోపాల్ రెడ్డి
  • పార్టీ స‌స్పెన్ష‌న్ వేటు వేయ‌క‌ముందు జాగ్ర‌త్త ప‌డ్డ ఎమ్మెల్యే
  • మునుగోడు, నాంప‌ల్లి, మ‌ర్రిగూడ‌, చండూరు మండ‌లాల అధ్య‌క్షుల‌పై కాంగ్రెస్ వేటు

న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే ప‌ద‌వితో పాటు కాంగ్రెస్ పార్టీకి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మంగ‌ళ‌వారం రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ త‌న‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేయ‌క‌ముందే కోమ‌టిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్ర‌మంలో మునుగోడుపై మంచి ప‌ట్టున్న కోమ‌టిరెడ్డి వెంట ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు బ‌య‌ట‌కు వెళ్ల‌నున్నార‌న్న వార్త‌ల‌పై కాంగ్రెస్ పార్టీ వేగంగా స్పందించింది. 

దిద్దుబాటు చ‌ర్య‌ల్లో భాగంగా రాజ‌గోపాల్ రెడ్డి వెంట వెళుతున్నార‌ని భావిస్తున్న 4 మండ‌లాల పార్టీ అధ్య‌క్షుల‌పై కాంగ్రెస్ పార్టీ సస్పెన్ష‌న్ వేటు వేసింది. ఈ మేర‌కు ఆ పార్టీ బుధ‌వారం కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన వారిలో మునుగోడు, మ‌ర్రిగూడ‌, నాంప‌ల్లి, చండూరు మండ‌లాల అధ్య‌క్షులు ఉన్నారు.

More Telugu News