TDP: ఎన్టీఆర్ కూతురు బేలగా ఆత్మహత్య చేసుకుందంటే ఎవరూ నమ్మడం లేదు: విజ‌య‌సాయిరెడ్డి

ysrcp mp vijay sai reddy tweet on uma maheswari suicide
  • సీబీఐ ద‌ర్యాప్తుతో నిజం నిగ్గు తేల్చాల‌న్న సాయిరెడ్డి
  • మా చంద్ర‌న్న వేధించాడా? అంటూ వ్యాఖ్యానించిన వైసీపీ నేత‌
  • హైద‌రాబాద్‌లో పూర్తయిన ఉమా మ‌హేశ్వ‌రి అంత్య‌క్రియ‌లు
రెండు రోజుల క్రితం ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావు చిన్న కుమార్తె ఉమా మ‌హేశ్వ‌రి ఘ‌ట‌న‌పై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి బుధ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు. ఉమా మ‌హేశ్వ‌రి మ‌ర‌ణంపై అనుమానాలు ఉన్నాయ‌ని ఆయ‌న అందులో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీబీఐతో ద‌ర్యాప్తు చేప‌ట్టి నిజం నిగ్గు తేల్చాలంటూ ఆయ‌న డిమాండ్ చేశారు.

ఎన్టీఆర్ కూతురు బేలగా ఆత్మహత్య చేసుకుందంటే ఎవరూ నమ్మడం లేదని వ్యాఖ్యానించిన సాయిరెడ్డి... మా చంద్ర‌న్న వేధించాడా?  లేదంటే ఇంకెవ‌రైనా చంపి ఉరి వేశారా? అన్న అనుమానాలున్నాయ‌ని ఆరోపించారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డ ఉమా మ‌హేశ్వ‌రి అంత్య‌క్రియ‌లు బుధ‌వారం హైద‌రాబాద్‌లో ముగిసిన సంగ‌తి తెలిసిందే.
TDP
YSRCP
NTR
Uma Maheswari
Vijay Sai Reddy
Hyderabad

More Telugu News