Bindhu Madhavi: తన డ్రెస్సింగ్ పై కామెంట్ చేసిన నెటిజన్ కు బింధుమాధవి ఘాటు సమాధానం!

Bindhu Madhavi strong reply to netizen

  • ఇటీవల క్లీవ్ కనపడేలా ఫొటో షూట్ చేసిన బింధుమాధవి
  • బింధుపై గౌరవం పోయిందన్న ఒక నెటిజన్
  • దుస్తుల వల్లే గౌరవం వస్తుందనుకుంటే.. ఆ గౌరవం తనకొద్దన్న బింధు

ఆమధ్య కాలంలో టాలీవుడ్ కు వచ్చిన అతి తక్కువ మంది తెలుగు అమ్మాయిల్లో బింధుమాధవి ఒకరు. తెలుగుదనం ఉట్టిపడేలా ఉండే బింధుమాధవిని అభిమానించే వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఎక్స్ పోజింగ్ కు కూడా ఆమె దూరంగానే ఉంటారు. ఇటీవల బిగ్ బాస్ ఓటీటీలో ఆమె విన్నర్ గా నిలిచారు. ఈ షోలో ఇతర మహిళా కంటెస్టెంట్లు కాస్త స్కిన్ షో చేసినప్పటికీ... బింధుమాధవి మాత్రం పద్ధతైన వస్త్రధారణతో అందరినీ ఆకట్టుకున్నారు. దీంతో ప్రేక్షకులకు ఆమెపై అభిమానం పెరిగింది. 

అయితే, తాజాగా ఆమె చేసిన ఒక ఫొటో షూట్ కొందరికి నచ్చడం లేదు. గ్రీన్ కలర్ మినీ స్కర్ట్ లో క్లీవ్ షో చేసేలా ఉన్న ఫొటోలను ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు. దీనిపై ఒక మహిళా నెటిజెన్ స్పందిస్తూ.... బిగ్ బాస్ లో ఇతర కంటెస్టెంట్లు అందరూ ఎక్స్ పోజింగ్ చేస్తే... బింధు మాధవి మాత్రం సంప్రదాయబద్ధమైన దుస్తుల్లో కనిపించిందని... అయితే... పాప్యులారిటీ కోసం ఇప్పుడు ఆమె దిగిన ఫొటోలతో ఆమెపై తనకు గౌరవం పోయిందని సదరు నెటిజెన్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై బింధుమాధవి స్పందిస్తూ... దుస్తుల వల్లే ఒక వ్యక్తికి గౌరవం వస్తుందనుకుంటే... అలాంటి గౌరవం తనకు వద్దని ఘాటుగా సమాధానమిచ్చారు.

More Telugu News