Galla Jayadev: కుటుంబ సభ్యులతో కలిసి మహిళా ఎంపీలకు లంచ్ ఏర్పాటు చేసిన గల్లా జయదేవ్

Galla Jaydev hosts lunch to women legislatures in Delhi

  • కొనసాగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
  • ఢిల్లీలో ఉన్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్
  • గల్లా ఇంట లంచ్ స్వీకరించిన మహిళా ఎంపీలు

ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. సౌమ్యుడిగానూ, స్నేహశీలిగానూ గుర్తింపు ఉన్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా వర్షాకాల సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఆయన పలు పార్టీలకు చెందిన మహిళా ఎంపీలకు తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. 

డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తదితరులు గల్లా నివాసంలో మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో గల్లా జయదేవ్ తల్లి గల్లా అరుణకుమారి, సోదరి డాక్టర్ గౌరినేని రమాదేవి తదితర కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోను గల్లా జయదేవ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Galla Jayadev
Lunch
Kanimozhi
Mahua Moitra
Supriya Sule
Galla Aruna Kumari
Gourineni Ramadevi
  • Loading...

More Telugu News