Telangana: టీఆర్ఎస్‌కు రాజీనామా చేయ‌నున్న మంత్రి ఎర్ర‌బెల్లి సోద‌రుడు ప్ర‌దీప్ రావు?

errabelli pradeep rao will resigns trs

  • ఈ నెల 7న టీఆర్ఎస్‌కు రాజీనామా చేయ‌నున్న ప్ర‌దీప్ రావు
  • రేపు వ‌రంగ‌ల్‌లో త‌న అనుచ‌రుల‌తో భేటీ కానున్న వైనం
  • భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌పైనా స్ప‌ష్ట‌త ఇవ్వ‌నున్న మంత్రి సోద‌రుడు

తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్‌ కీల‌క నేత‌, మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు సోద‌రుడు ప్ర‌దీప్ రావు తాజాగా టీఆర్ఎస్‌కు రాజీనామా చేసేందుకు నిర్ణ‌యించుకున్నారు. ఈ నెల 7న ఆయ‌న టీఆర్ఎస్‌కు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్ర‌మంలో బుధ‌వారం వ‌రంగ‌ల్‌లో ఆయ‌న త‌న అనుచరుల‌తో ప్ర‌త్యేకంగా భేటీ కానున్నారు. 

ఈ భేటీలో తాను టీఆర్ఎస్‌కు ఎందుకు రాజీనామా చేయ‌నున్నాన‌న్న విష‌యాన్ని ఆయ‌న త‌న అనుచ‌రుల‌కు చెప్ప‌నున్న‌ట్లుగా స‌మాచారం. అంతేకాకుండా టీఆర్ఎస్‌కు రాజీనామా త‌ర్వాత త‌న భవిష్య‌త్తు కార్యాచ‌ర‌ణ ఖ‌రారుపైనా ఆయ‌న త‌న అనుచ‌ర వ‌ర్గానికి స్ప‌ష్ట‌త ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం.

Telangana
TRS
Errabelli
Pradeep Rao
Warangal
  • Loading...

More Telugu News