Sensex: స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in profits

  • 21 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 5 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 2.59 శాతం పెరిగిన ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్ విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. చైనా, తైవాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 21 పాయింట్లు లాభపడి 58,136కు చేరుకుంది. నిఫ్టీ 5 పాయింట్లు పెరిగి 17,345 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.59%), ఏసియన్ పెయింట్స్ (2.18%), ఎన్టీపీసీ (1.85%), మారుతి (1.81%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.60%). 

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-1.63%), హెచ్డీఎఫ్సీ (-1.30%), ఎల్ అండ్ టీ (-1.20%), టాటా స్టీల్ (-1.20%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.13%).

  • Loading...

More Telugu News