Commonwealth Games: కామన్‌వెల్త్‌ క్రీడల్లో ప్రమాదానికి గురైన భారత మహిళా సైక్లిస్ట్‌.. వీడియో ఇదిగో!

Accident to cyclist Meenakshi in Commonwealth games

  • 10 కిలోమీటర్ల స్క్రాచ్ రేసులో కింద పడ్డ మీనాక్షి
  • ఆమె పైనుంచి వెళ్లిపోయిన మరో సైకిల్
  • గాయపడిన ఆమెను స్ట్రెచర్ పై తరలించిన వైనం

బర్మింగ్ హామ్ లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. భారత్ కు చెందిన మహిళా సైక్లిస్ట్ మీనాక్షి తీవ్రంగా గాయపడింది. 10 కిలోమీటర్ల స్క్రాచ్ రేసు ప్రారంభమైన కాసేపటికే ఆమె సైకిల్ పై నుంచి జారి కింద పడింది. సైకిల్ తో పాటు ఆమె కూడా జారుకుంటూ ట్రాక్ అంచుకు వెళ్లింది.  

ఇదే సమయంలో న్యూజిలాండ్ కు చెందిన బ్రయోనీ బోథా సైకిల్ మీనాక్షి పైనుంచి వేగంగా దూసుకుపోయింది. ఈ క్రమంలో బ్రయోనీ కూడా సైకిల్ మీద నుంచి కింద పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే మీనాక్షిని స్ట్రెచర్ మీద తీసుకెళ్లారు. ప్రమాదానికి గురైన మీనాక్షి, బ్రయోనీలను పోటీ నుంచి తప్పించారు. మీనాక్షి ప్రమాదానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Commonwealth Games
Indian Cyclist
Meenakshi
Accident

More Telugu News