Realme Watch 3: రియల్ మీ వాచ్ 3 అమ్మకాలు నేటి నుంచే

Realme Watch 3 goes on sale in India today

  • ఫ్లిప్ కార్ట్, రిటైల్ స్టోర్లలో లభ్యం
  • ఎన్నో ఫీచర్లు..  ధర రూ.3,499
  • ఆరంభంలో రూ.500 డిస్కౌంట్
  • బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్

రియల్ మీ వాచ్ 3 తొలి అమ్మకాలు నేడు మొదలయ్యాయి. యాపిల్ ప్రీమియం వాచ్ ను ఇది పోలి ఉంటుంది. ధర మాత్రం అందుబాటులోనే ఉంది. దీని ధర రూ.3,499. ఆరంభంలో కొనుగోలు చేసే వారికి రూ.500 తగ్గింపు లభిస్తుంది. అంటే రూ.2,999కే దీనిని సొంతం చేసుకోవచ్చు. ఇది పరిమిత కాలం పాటు ఉండే ఆఫర్ మాత్రమే. రిటైల్ స్టోర్లలో, ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేసుకోవచ్చు. 

బ్లాక్, గ్రే రంగుల్లో లభిస్తుంది. ప్లాస్టిక్ తో చేసిన వాచ్ ఇది. 1.8 అంగుళాల డిస్ ప్లే, ఐపీ68 రేటింగ్ తో వస్తుంది. ఈ వాచ్ లో 110 రకాల డిస్ ప్లే ఫేస్ లను ఎంపిక చేసుకోవచ్చు. ఈ వాచ్ ను ఆండ్రాయిడ్ తోపాటు యాపిల్ ఫోన్లకు సైతం కనెక్ట్ చేసుకోవచ్చు. నిద్ర పోయే తీరు, రోజువారీగా ఎన్ని అడుగులు నడుస్తున్నారు? గుండె స్పందనల రేటు, రక్తంలో ఆక్సిజన్ స్థాయులు, ఒత్తిడి ఏ స్థాయిలో ఉంది?.. ఇలా ఎన్నింటినో ఈ వాచ్ ట్రాక్ చేయగలదు. రియల్ మీ వాచ్ 3 నుంచి బ్లూటూత్ కాలింగ్ చేసుకోవచ్చు. అలాగే, స్మార్ట్ వాచ్ లోనే కాల్స్ రిసీవ్ చేసుకుని మాట్లాడొచ్చు. వాచ్ లో మైక్రోఫోన్, స్పీకర్ కూడా ఉన్నాయి.

Realme Watch 3
slaes
discount
  • Loading...

More Telugu News