YSRCP: వైసీపీ ఎంపీల ప్రెస్‌మీట్‌లో ఆర్.కృష్ణ‌య్య‌... వీడియో ఇదిగో

r krishnaiah spotted in ysrcpp media meet in delhi

  • వైసీపీ ఎంపీగా ఎన్నికైన ఆర్.కృష్ణ‌య్య‌
  • పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల‌కు హాజ‌రు
  • వైసీపీ ఎంపీల మీడియా స‌మావేశంలో క‌నిపించిన వైనం

బీసీల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఏళ్ల త‌ర‌బ‌డి ఉద్య‌మాలు న‌డిపిన ఆర్.కృష్ణ‌య్య ఇప్పుడు వైసీపీ ఎంపీగా స‌రికొత్త బాధ్య‌త‌ల్లోకి దిగిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఖాళీ అయిన రాజ్య‌స‌భ సీట్ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా... తెలంగాణ‌కు చెందిన ఆర్.కృష్ణ‌య్య‌ను ఏపీలోని అధికార పార్టీ వైసీపీ త‌న అభ్య‌ర్థిగా ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే. ఏక‌గ్రీవంగానే వైసీపీ ఎంపీగా రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన ఆర్.కృష్ణ‌య్య ఇటీవ‌లే ఎంపీగా కూడా ప్ర‌మాణం చేశారు. 

తాజాగా పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల్లో భాగంగా వైసీపీ ఎంపీల‌తో రాజ్య‌స‌భ స‌మావేశాల‌కు హాజ‌ర‌వుతున్న ఆర్.కృష్ణ‌య్య‌... సోమ‌వారం రాత్రి వైసీపీ ఎంపీలంతా క‌లిసి ఢిల్లీలో ఏర్పాటు చేసిన‌ మీడియా స‌మావేశానికి స‌హ‌చర ఎంపీల‌తో క‌లిసి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా రాజ‌మ‌హేంద్రవరం ఎంపీ మార్గాని భ‌ర‌త్ రామ్ మీడియాతో మాట్లాడుతుండ‌గా... ఆయ‌న పక్క‌నే కూర్చున్న ఆర్.కృష్ణ‌య్య మీడియా దృష్టిని ఆక‌ర్షించారు.

YSRCP
Andhra Pradesh
Telangana
Parliament
Rajya Sabha
R.Krishnaiah
YSRCPP

More Telugu News