Raviteja: 'రామారావు' నిర్మాతకి రవితేజ మాట ఇచ్చాడట!

Ramarao On Duty movie update

  • ఇటీవలే థియేటర్లకు వచ్చిన 'రామారావు'
  • కొత్త దర్శకుడిని పరిచయం చేసిన రవితేజ 
  • రిలీజ్ రోజునే వచ్చిన నెగెటివ్ టాక్
  • మరో సినిమా చేసి పెడతానన్న రవితేజ?

రవితేజను వరుస ఫ్లాపుల తరువాత 'క్రాక్' సినిమా ఆదుకుంది. ఆ తరువాత ఆయన చేసిన 'ఖిలాడి' .. రీసెంట్ గా వచ్చిన 'రామారావు ఆన్ డ్యూటీ' రెండూ కూడా నిరాశపరిచాయి. భారీ బడ్జెట్ తో నిర్మితమైన 'రామరావు' భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అంచనాలను ఎంత మాత్రం అందుకోలేకపోయింది.

ఈ సినిమాకి సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించారు. ఇంతకుముందు ఆయన నిర్మించిన 'పడిపడిలేచే మనసు' .. 'ఆడవాళ్లు మీకు జోహార్లు' .. 'విరాట పర్వం' సినిమాలు ఆర్థికపరమైన నష్టాలను తీసుకుని వచ్చాయి. అయినా బడ్జెట్ కి వెనకాడకుండా ఆయన 'రామారావు' సినిమాను నిర్మిచారు. అది మరింత నష్టపరిచిందనే టాక్ వినిపిస్తోంది.

అయితే పారితోషికం విషయంలో పట్టింపు లేకుండా నెక్స్ట్ మూవీ చేసి పెడతాననీ, బడ్జెట్ తక్కువలో చేయడానికైనా తాను రెడీగానే ఉంటానని ఆయనకి రవితేజకి మాట ఇచ్చాడని అంటున్నారు. ఇక సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో రూపొందుతున్న 'దసరా' అయినా ఆయనను నిలబెట్టాలని శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.

Raviteja
Sudhakar Cherukuri
Ramarao On Duty Movie
  • Loading...

More Telugu News