Sensex: దూసుకుపోయిన మార్కెట్లు.. ఆద్యంతం లాభాల్లోనే ట్రేడింగ్
- 545 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 182 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 6 శాతానికి పైగా లాభపడ్డ ఎం అండ్ ఎం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. వరుసగా నాలుగో రోజు మార్కెట్లు లాభాలను మూటకట్టుకున్నాయి. జీఎస్టీ వసూళ్లు గరిష్ఠ స్థాయికి చేరుకోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. వాణిజ్య సిలిండర్ ధరలు తగ్గడం కూడా కొంత కలిసొచ్చింది. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 545 పాయింట్లు లాభపడి 58,116 పాయింట్లకు పెరిగింది. నిఫ్టీ 182 పాయింట్లు పుంజుకుని 17,340 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (6.15%), రిలయన్స్ (2. 64%), మారుతి (2.64%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (2.42%), భారతి ఎయిర్ టెల్ (2.40%).
టాప్ లూజర్స్:
సన్ ఫార్మా (-2.65%), హిందుస్థాన్ యూని లీవర్ (-1.66%), నెస్లే ఇండియా (-0.49%), ఏసియన్ పెయింట్స్ (-0.26%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.23%).